మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పాయకట్టు ఇలవేల్పు ఆరిమాని గంగమ్మ తల్లి ని ఏపీ వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ డైరెక్టర్ ,జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి ఆర్ రాజన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో తిమ్మారెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జై చంద్ర బాబు నాయుడు, సాఫ్ట్వేర్ బాలు టిడిపి నాయకులు రాజశేఖర్ నాయుడు మాజీ ఎంపిటిసి వేముల నాయుడు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పైనేని ధనుంజయ నాయుడు, జలంధర్ నాయుడు, దాము నాయుడు వెంకటరమణ, ఆలయ అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.







