ఆరిమాని గంగమ్మ తల్లి హుండీ ద్వారా ఆరు లక్షల 40 వేల 990 రూపాయలు ఆదాయం
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండల తయ్యురు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయం లో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఈవో తిమ్మారెడ్డి సమక్షంలో నిర్వహించారు. మాట్లాడుతూ సంక్రాంతి ఉత్సవాల్లో భక్తులు హుండీలో వేసిన కానుకలను పాలకమండలి సమక్షంలో హుండీ లెక్కించామని అన్నారు. సేవ టికెట్లు ద్వారా రెండు లక్షల ఇరవై ఒకవేల 735 రూపాయలు, తాత్కాలిక హుండీ ద్వారా రెండు లక్షల 4299 రూపాయలు శాశ్వత హుండి 23 అక్టోబర్ 24 నుండి 16 జనవరి 25 వరకు 1,76 వేల 250 రూపాయలు మొత్తం 6 లక్షల 40,990 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లింగారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వెంకట చలపతి ఆచార్యులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ధనుంజయులు, తదితరులు పాల్గొన్నారు.









