

- మన న్యూస్,నిజాంసాగర్ ,జుక్కల్,
- అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇంద్రసేన్ అన్నారు.నిజాంసాగర్ మండలంలో ఎరువుల దుకాణాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,గాయత్రి చక్కర కర్మగారంలో ఉన్న ఎరువుల గోదాంను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డు తీసుకువచ్చిన రైతులకు ఇపిఓఎస్ యంత్రం ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు విక్రయించాలని ఆయన దుకాణందారులను సూచించారు.యూరియా, ఇతర ఎరువుల నిలువలు, నిలువ పట్టికలు,నిల్వ రిజిస్టర్ల ను ఆయన పరిశీలించారు. యూరియా కొరత లేకుండా రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరఫరా చేయుస్తున్నమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్,తదితరులు ఉన్నారు.