నెమళ్ళూరు బుజ్జి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, సాంస్కృతిక విభాగం,

మనన్యూస్:తిరుపతి,శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో 31-12-2024 మంగళవారం స్పౌజ్ కేటగిరీ పింఛన్ ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, తెలుగుగంగ కాలని సచివాలయ సెక్రటరీ రేవతి పట్టణంలోని 22 వ వార్డు నందు పి. ఉషా W/O లేట్ పి. మురళి నాయుడు కు పంపిణీ చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో ‘స్పౌజ్ కేటగిరీ పింఛన్లు‘ పేరిట మరో కేటగిరీ పింఛన్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని నెమళ్ళూరు బుజ్జి తెలిపారు. పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద వెంటనే మరుసటి నెల నుంచే పింఛన్ వచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నవంబరు 1- 2024 న చెప్పిన ప్రకారం 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 15- 2024 వరకు ఈ రకమైన వాళ్ళు 6331 మంది, , రాష్ట్రంలో ఎంపికయ్యారు. అలాగే వివిధ కారణాలతో 2 లేదా 3 నెలలు పింఛన్ తీసుకోని వారు కూడా 50 వేల మంది వరకు ఉండటంతో వారికి కూడా డిసెంబర్ 31న ఒకేసారి 2 లేదా 3 నెలల పింఛన్ పంపిణీ చేసారు. గత వైసిపి ప్రభుత్వంలో భర్త చనిపోయిన కూడా భార్యకు వితంతు పింఛను ఇవ్వకుండా, వివిధ కారణాలతో ఒక్క నెల పింఛన్ తీసుకొని వారు మరుసటి నెల పింఛన్ పొందలేని విధంగా లబ్దిదారులను మబ్బి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారికి అండగా నిలవడానికి , లోపాలను పూర్చడానికి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 6331 , జిల్లా వ్యాప్తంగా250, శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో 07, శ్రీకాళహస్తి రూరల్ 13, రేణిగుంట మండలం , 07, ఏర్పేడు మండలం 09, తొట్టంబేడు మండలం 05 , మొత్తం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 41 స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు మంజూరు చేసారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి