మనన్యూస్:తిరుపతి,శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో 31-12-2024 మంగళవారం స్పౌజ్ కేటగిరీ పింఛన్ ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, తెలుగుగంగ కాలని సచివాలయ సెక్రటరీ రేవతి పట్టణంలోని 22 వ వార్డు నందు పి. ఉషా W/O లేట్ పి. మురళి నాయుడు కు పంపిణీ చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో 'స్పౌజ్ కేటగిరీ పింఛన్లు' పేరిట మరో కేటగిరీ పింఛన్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని నెమళ్ళూరు బుజ్జి తెలిపారు. పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద వెంటనే మరుసటి నెల నుంచే పింఛన్ వచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నవంబరు 1- 2024 న చెప్పిన ప్రకారం 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 15- 2024 వరకు ఈ రకమైన వాళ్ళు 6331 మంది, , రాష్ట్రంలో ఎంపికయ్యారు. అలాగే వివిధ కారణాలతో 2 లేదా 3 నెలలు పింఛన్ తీసుకోని వారు కూడా 50 వేల మంది వరకు ఉండటంతో వారికి కూడా డిసెంబర్ 31న ఒకేసారి 2 లేదా 3 నెలల పింఛన్ పంపిణీ చేసారు. గత వైసిపి ప్రభుత్వంలో భర్త చనిపోయిన కూడా భార్యకు వితంతు పింఛను ఇవ్వకుండా, వివిధ కారణాలతో ఒక్క నెల పింఛన్ తీసుకొని వారు మరుసటి నెల పింఛన్ పొందలేని విధంగా లబ్దిదారులను మబ్బి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారికి అండగా నిలవడానికి , లోపాలను పూర్చడానికి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 6331 , జిల్లా వ్యాప్తంగా250, శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో 07, శ్రీకాళహస్తి రూరల్ 13, రేణిగుంట మండలం , 07, ఏర్పేడు మండలం 09, తొట్టంబేడు మండలం 05 , మొత్తం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 41 స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు మంజూరు చేసారు.