

మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాలు, రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్.సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని శ్రీకాళహస్తి పట్టణ పార్టీ సర్వసభ్య సమావేశమును పట్టణ నాయకులు గరికపాటి రమేష్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులుగా రాఘవనాయుడు కుప్పం హరీష్ రెడ్డిని పట్టణ నేతలు, కార్యకర్తలు,బూత్ కమిటీల అధ్యక్షులు కలసి ఏకగ్రీవంగా హరీష్ రెడ్డినీ ఎన్నికున్నారు.దానికి ముందు అధ్యక్షునిగా సొట్ట సుకుమార్ ప్రతిపాదించగా,చిలక రంగయ్య, మరియు పిల్లారి బత్తినయ్య హరీష్ రెడ్డిని అధ్యక్షులుగా బలపరిచారు.తదుపరి పట్టణ ఎన్నికల అధికారి మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పట్టణ సమావేశానికి వచ్చిన నాయకులు,కార్యకర్తలు, బూత్ కమిటీల అధ్యక్షులతో కలిపి సుమారుగా 120 మంది కార్యకర్తల,నేతల యొక్క ఏక అభిప్రాయ సేకరణతో పట్టణ పార్టీ అధ్యక్షులుగా రాఘనాయుడు కుప్పం lహరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దానికి ముందే పాత మండల పార్టీ కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ,కొత్త కమిటీ అధ్యక్షులుగా కార్యకలాపాలు ఈ రోజు నుంచి పరిగణలోకి వస్తుందని సభ తీర్మానించడం జరిగిందని ఎన్నికల అధికారి మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి ప్రకటించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి,అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,రాష్ట్ర సభ్యులు శ్రీమతి కండ్రిగ ఉమ గరికపాటి రమేష్ బాబు, మహిళా మోర్చ్చ చాగనం శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, ప్రజ్ఞాశ్రీ, రామ్ ఉమా సింగ్,ఓబీసీ సభ్యులు ఎస్వీ రమణ,నూతన అధ్యక్షులు ఆర్ హరీష్ రెడ్డి,చిలక రంగయ్య,జీవి అమర్నాథ్ కోనేటి అయ్యప్ప,పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి,సజ్జలు హరీష్, జ్ఞానగారి పోలయ్య,లింగాబత్తిన గోపాల్,గదిపాకుల యాతీష్, భరత నాయుడు, కటికం చెందు,శివా రెడ్డి,హరి,కనపర్తి రవి తేజ,నాని,సిద్ధూ,సుబ్బు పవన్ కామి వెంకట్రాయులు,కోలా మురళీ,ఇత్తడి మహేష్,ఇత్తడి కిరణ్,ప్రదీప్,సాయి తదితరులు పాల్గొన్నారు.