మన ధ్యాస, మక్తల్: గత కార్ని గ్రామపంచాయతీ కార్యదర్శి అయిన లక్ష్మి పై చర్యలు తీసుకోవాలని సోమవారం మక్తల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు చేశారు. నా యొక్క ఇంటి నెంబర్ 6-46 గల ఇంటిని నాపై రిజిస్ట్రేషన్ చేయాలని 24-06-2024 నాడు గ్రామ పంచాయతీ సెక్రెటరీ కీ అర్జీ పెట్టుకోవడం జరిగింది. గత మూడు నెలల కిందటే నా యొక్క ఇంటిని నా అనుమతి లేకుండా మా యొక్క వదిన అయినా,నాగేశ్వరమ్మ భర్త మల్లేష్ గౌడ్ పై రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిసింది. నా అనుమతి లేకుండా గత పంచాయతీ సెక్రెటరీ లక్ష్మీ 13-03-2024 నాడు,రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసిన గత కర్ణి గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మిని మరియు అందుకు సహకరించిన సాక్షులపై చర్యలు తీసుకుని నాకు న్యాయం జరగాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *