కావలి, అక్టోబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు
కావలి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న“ఇంటింటికీ ఎమ్మెల్యే – సమస్య మీది, పరిష్కారం నాది”* కార్యక్రమం 03.10.26, శనివారం ఉదయం 7 గంటలకు* కావలి పట్టణంలోని 37వ వార్డులో జరగనుంది.ఈ కార్యక్రమం వాయినందన ప్రెస్ రోడ్, వినాయకుని గుడి దగ్గర నుండి ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు, వార్డులోని సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకోనున్నారు.ఈ సందర్భంగా 37వ వార్డులోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో* నేరుగా ఎమ్మెల్యే కి అందించవచ్చు. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.కావున 37వ వార్డుకు చెందిన *కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జులు, క్లస్టర్ ఇన్చార్జులు, మహిళా నాయకులు మరియు KYSS సభ్యులు* అందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము.తేదీ: రేపు 03.10.2026, శనివారం సమయం: ఉదయం 07:00 గంటలకు,స్థలం వాయినందన ప్రెస్ రోడ్, వినాయక గుడి, 37వ వార్డు, కావలి వార్డు ప్రజలు తమ సమస్యలు, వినతులను ముందుగానే అర్జీల రూపంలో సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి అని ఆయన అన్నారు.