*కడివెళ్ళ సుప్రియ * పిలుపు*.
ఆదర్శ ప్రాథమిక పాఠశాల,మడిబాక గ్రామ పంచాయతీ రాజులకండ్రిగ లో సెప్టెంబరు 29వ తేదీ నందు జరిగిన నూతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలలో చైర్మన్‌గా కడివెళ్ళ సుప్రియ * ని, *వైస్ చైర్మన్ గా ఏ. రేవతి ఏకగ్రీవంగా నూతన కమిటీ సభ్యులు ఎన్నుకున్నట్లు పాఠశాల *ప్రధానోపాధ్యాయులు బాల సరస్వతి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రథమ సమావేశంలో నూతన చైర్మన్ కడివెళ్ళ సుప్రియ మాట్లాడుతూ చైర్మన్ గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు తల్లిదండ్రులందరికీ మరియు విద్యా కమిటీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనీ ఇదొక పదవిగా కాకుండా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప బాధ్యతగా నేను భావిస్తున్నాను మరియు ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, మన కమిటీ ముఖ్య ఉద్దేశం పాఠశాల సమగ్ర వికాసం మరియు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం. ఈ లక్ష్యాలను సాధించడానికి మీ అందరి సహకారం మరియు
తల్లిదండ్రుల భాగస్వామ్యం అందించాలని కోరారు.
*వైస్ చైర్మన్ ఏ.రేవతి గారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యం కాదు. మన నూతన నియమాల్లో చెప్పినట్లుగా 75% భాగస్వామ్యం తల్లిదండ్రులదే. అందుకే ప్రతి నెలా జరిగే సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరై మీ అమూల్యమైన సలహాలు అందించాలని కోరారు.
“మన బడి – మన పిల్లల భవిష్యత్తు”. మనమంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేసి, మన ఆదర్శ పాఠశాల,రాజులకండ్రిగ పాఠశాలను ఏర్పేడు మండలంలోనే కాకుండా తిరుపతి జిల్లాలోనే ఒక ఉత్తమ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుకుందాం అని నూతన కమిటీ సభ్యులు ముక్త కంఠంతో పిలునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
