మన ధ్యాస, మక్తల్: ఈనెల 24న మక్తల్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రధానంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు . నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యం, ముఖ్యంగా పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదికారులు,నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *