తిరుపతి:
భారతీయ మజ్దూర్ సంఘ్ ( బి ఎం ఎస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లోవారెడ్డి మరియు దక్షిణ భారత క్షేత్ర సంఘటన మంత్రి డి.ఎం.ఎస్. రాధాకృష్ణలను తిరుపతి జిల్లా బి.ఎం.ఎస్. సెక్రటరీ పూల వెంకటాద్రి యాదవ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని హృదయపూర్వక స్వాగతం పలికారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు నెల్లూరు జిల్లాలలో నాలుగు రోజుల విస్తృత పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి విచ్చేసిన అగ్రనాయకులను పూల వెంకటాద్రి యాదవ్ నేరుగా కలుసుకుని, పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు.
ఈ సందర్భంగా పూల వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ — “రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లోవారెడ్డి , సౌత్ ఇండియా క్షేత్ర సంఘటన మంత్రి రాధాకృష్ణ తిరుపతికి విచ్చేసిన సందర్భంగా వారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. తిరుపతి జిల్లా బి.ఎం.ఎస్. తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికాను. ఈ నాలుగు రోజుల ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల పర్యటన కార్మిక లోకానికి మరియు సంఘ సంస్థాగత రంగానికి ఎంతో బలకలిగిస్తుంది,” అని తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా రెండు జిల్లాల్లో కార్మిక సమస్యలపై చర్చలు, సంఘ విస్తరణ మరియు రాబోయే కార్యక్రమాలపై అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.
