పోటీల బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి
మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 27న నిర్వహించే జాతీయస్థాయి కరాటే పోటీలకు సంబంధించిన బ్రోచర్ ను గురువారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. మాస్టర్ బోడోకాన్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఈనెల 27న నిర్వహిస్తున్నామని, హజరు కావాలని నిర్వాహకులు కరాటే మాస్టర్ సయ్యద్ కోరారు. పోటీలలో ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు వస్తారని, టెస్టులతోపాటు బహుమతుల అందజేత ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున హాజరై పోటీలను విజయవంతం చేయాలని కోరారు.