మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో కొలువుదీరిన గణనాథునికి ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు, సిబ్బంది బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి నిమజ్జనాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ఫ్యాక్టరీ ఆవరణ నుంచి గణనాథుని శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. డప్పుల మోత, భక్తిగీతాల మధ్య శోభాయాత్ర కొనసాగింది.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ షాదుల్లా, కేన్ మేనేజర్ వెంగల్రెడ్డి, డీజీఎం శ్రీనాథ్‌రెడ్డి, సుబ్బారెడ్డి, పీవో గోవింద్, మాగి సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్, వడ్డేపల్లి సర్పంచ్ బొజ్జ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.