సైబర్ హెల్ప్‌లైన్–1930, డ్రగ్స్ హెల్ప్‌లైన్–1972, పోలీస్ హెల్ప్‌లైన్–112 సేవలపై అవగాహన –
జీవిత విలువలు, క్రమశిక్షణ, లక్ష్యసాధన, మానసిక ధైర్యంపై మార్గనిర్దేశం.
​తిరుపతి, జులై 19: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తమీమ్ అహ్మద్ మరియు శక్తి టీం పోలీసులు నగరంలోని న్యూ బాలాజీ కాలనీలో గల ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులకు సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ తమీమ్ అహ్మద్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో నైతిక విలువలు, క్రమశిక్షణ, లక్ష్యంతో కూడిన విద్య ముఖ్యమని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ఆత్మహత్య వంటి ఆలోచనలకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. అనంతరం లోన్ యాప్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, అపరిచిత వీడియో కాల్స్, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి సైబర్ నేరాల పట్ల, అలాగే మత్తు పదార్థాల వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోక్సో చట్టం, బాలలపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సైబర్ హెల్ప్‌లైన్–1930, డ్రగ్స్ హెల్ప్‌లైన్–1972, పోలీస్ హెల్ప్‌లైన్–112 సేవలను మరియు శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిస్తూ విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *