దుత్తలూరు జూలై 19, ఎల్లో సింగం ప్రతినిధి నాగరాజు కె…

ఆదివారం దుత్తలూరు లో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బద్వేల్ వెళ్ళే మార్గంలో మాదిగ భవనం స్థలంలో గతంలో ఎమ్మార్పీఎస్ జెండా ను ఏర్పాటు చేయగా ప్రతి సంవత్సరం జూలై 7 న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అదే క్రమంలో ఈ నెల 7 వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం జరిగినది అనంతరం అక్కడ ఎగురుతున్న ఎమ్మార్పీఎస్ జెండాను చూసి ఓర్వలేని నాగేంద్ర జెండాకు నిప్పు పెట్టిన విషయం తెలుసుకొని,ఎంఎస్పీ మండల ఇన్చార్జీ
గొల్లపల్లి మోహన్ రావు మాదిగ ఆధ్వర్యంలో
నేడు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ మాదిగ భవనం స్థలంలో జెండాను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జరిగిన విషయం పై స్థానిక ఎస్ఐ సుభాషిని తో మాట్లాడి నిందితుడు నాగేంద్రను,వెంటనే అరెస్ట్ చేయాలని మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా జెండాకు నిప్పు బెట్టి నేటికీ వారం రోజులు అవుతున్న చర్యలు ఎక్కడ,ఈ సమాజంలో మాదిగలు ఆత్మగౌరవంగా జీవిస్తున్నారంటే కేవలం ఎమ్మార్పీఎస్ ఉధ్యమం మందకృష్ణ మాదిగ పోరాటం వల్లే అలాంటి జెండాకు నిప్పు బెట్టి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన అతని పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఇప్పటి కైన జిల్లా ఎస్పీ మేడం స్పందించి ఎమ్మార్పీఎస్ జెండాను తగుల బెట్టిన నాగేంద్ర పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇలాంటి ఘాతుకానికి పాల్పపడిన, శాకం నాగేంద్ర పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో మందకృష్ణ మాదిగ ఆదేశాలతో బలమైన కార్యచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగ,ఎంఎస్పీ వింజమూరు మండల ఇన్చార్జీ గోచిపాతల ఆనంద్ రావు మాదిగ,ఎంఎస్పీ మండల అధ్యక్షులు బర్రె అర్జున్ మాదిగ,యనమల వెంగయ్య మాదిగ,గంగపట్ల రవీందర్ మాదిగ,యనమల రమణయ్య మాదిగ,తాళ్ళూరి దాసు మాదిగ,బర్రె రమేష్ మాదిగ,గంగపట్ల మురళి మాదిగ,కొశినపోగు విజయ్ మాదిగ,వడ్లమూడి ప్రకాష్ మాదిగ,గొల్లపల్లి వెంగళరావు మాదిగ,కండే గిరి మాదిగ,ముంగర రమణయ్య మాదిగ,తదితరులు పోల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *