మన ధ్యాస,కొడవలూరు, మార్చి 29 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 90 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె మిక్కిలింపేట గ్రామంలో టిడిపి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ……తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీని స్థాపించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ నాటిన మొక్కను చంద్రబాబు నాయుడు మహావృక్షంగా పెంచారని, నేడు యువనేత లోకేష్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని కొనియాడారు.కేవలం 21 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో మిక్కిలింపేట గ్రామ అభివృద్ధి కోసమే రూ. 1 కోటి 81 లక్షలు వెచ్చించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె ప్రస్తావించారు:పారిశ్రామిక హబ్‌గా కొడవలూరు. చంద్రబాబు కృషితో టాటా వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ పనుల్లో వేగం పెరిగిందని, త్వరలోనే కొడవలూరు మండలం పారిశ్రామిక హబ్‌గా మారుతుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఏప్రిల్ 2 న పదవీ విరమణ చేయబోతున్న స్థానిక సర్పంచ్ బుజ్జిరెడ్డి ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘనంగా సన్మానించారు. గతంలో ఉత్సవ విగ్రహాలుగా మారిన సర్పంచ్‌లకు మళ్లీ అధికారాలను ఇచ్చి గౌరవించింది చంద్రబాబేనని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. భవిష్యత్తులో మిక్కిలింపేటలో స్మశానవాటికల ఆధునీకరణ, డ్రైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం మరియు మిక్కిలింపేట గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *