మన ధ్యాస, కొడవలూరు, మార్చి 30: ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం బసవయ్య పాళెం గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ….. కోవూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ముఖ్యంమత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తేగానే స్పందించి సివిల్ సప్లయ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ని కోవూరు పంపారన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి స్థానిక పరిస్థితులు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గోనె సంచుల కొరత, లారీల కొరత తదితర సమస్యలు పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలినిచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భముగా ప్రస్తావించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సివిల్ సప్లయ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ధన్యవాదాలు తెలియచేసారు. అనంతరం ఆమె స్థానిక తెలుగుదేశం నాయకులకు దిశానిర్దేశం చేస్తూ నాయకులు కార్యకర్తల కృషి ఫలితంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిందనన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గతంలో మండల వ్యాప్తంగా గ్రామాల్లో గుంతల మయమై వున్న రోడ్లను పునరుద్ధరించామన్నారు. రెండు రోజుల క్రితం కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో 90 లక్షలతో వేసిన సిసి రోడ్డు గురించి మాట్లాడుతూ దాదాపు 40 ఏళ్లకు ముందు నిర్మించిన ఆ రోడ్డును తాను ఎమ్మెల్యే అయ్యాకే పునర్నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారన్నారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో బసవయ్య పాళెం గ్రామాభివృద్ధికి 45 లక్షల 87 వేల 722 వెచ్చించామన్నారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తేవాలని కోరారు. నాయకులు విభేదాలు వీడి ఐకమత్యంగా వుంటూ గ్రామాభివృద్ధికి పాటు పడాలని క్యాడర్ కు హితోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





