తిరుపతి,MANA Dhyasa మార్చి 29:-

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తిరుపతి, ఆస్ట్రా నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తిరుపతి నగరంలోని వైద్యులందరూ పాల్గొనాలని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి కోరారు. ఈ సందర్భంగా కోశాధికారి డాక్టర్ పి. రెడ్డప్ప కూడా వైద్యులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం వైద్య రంగ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవల అందుబాటు, ప్రభుత్వ–వైద్యుల సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో వైద్య సేవల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అవగాహన.ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో వైద్యుల పాత్రపై చర్చ.వైద్య వృత్తిలో సవాళ్లు, అవకాశాలపై ముఖ్యమంత్రితో పరస్పర చర్చ.ఈ కార్యక్రమం వైద్య రంగానికి ఎంతో ఉపయోగకరమని, అందరూ తప్పక హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *