Mana Dhyasa :- తిరుపతి ఇప్పుడు ప్రతినిధి మార్చి 6: తిరుపతి లోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా వన్నియకుల క్షత్రియ సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమ పోస్టర్ ను వన్నియకుల క్షత్రియ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వన్నియకుల క్షత్రియలు రానున్న రోజుల్లో ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.వన్నియకుల క్షత్రియ లను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వన్నియకుల క్షత్రియలు ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ వేదికను నిర్వహిస్తున్నమన్నారు.అన్ని అంశాల్లో వన్నియకుల క్షత్రియలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.వన్నియకుల క్షత్రియలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ నెల 8న నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర నిర్వహించే వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలోవన్నియకుల క్షత్రియలు సోదరులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంఘం యొక్క ఉద్దేశ్యము వన్నియకుల క్షత్రియలలో బాగా వెనకబడిన వారికి ఆర్థిక సహాయం, స్కాలర్షిప్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్మెంట్, సొంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఆర్థిక సహాయం, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *