
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఎట్టకేలకు ఆదివారం ఆవిష్కరించారు. లింగంపర్తి వాటర్ ట్యాంక్ పక్కన మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏర్పాటు చేశారు. అనంతరం వంగవీటి మోహనరంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడిన రంగాను ఎవ్వరు మర్చిపోలేని వారు అన్నారు. రంగ విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు చేశాడని ఈ సందర్భంగా కొనియాడారు.. ఈనాటికి ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో చెక్కుచెదరలేదని అన్నారు. ఆలాంటి మహా నాయకుడు లేకపోవడం పెద్దలోటని పేద ప్రజలకు పెద్దలోతు
అని అన్నారు. పేదల కోసం పనిచేసిన వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అలాంటి వ్యక్తులలో వంగవీటి మోహనరంగ ఒకరని కొనియాడారు. దీనికి సంబంధించి త్వరలో వంగవీటి మోహన్ రంగ తనీరు వంగవీటి రాధా, ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా, రాష్ట్ర జిల్లా లోని కూటమి నాయకులు రంగా అభిమానులు లతో భారీ ఎత్తున కార్యక్రమం చేసే అవకాశం ఉందని వంగవీటి మోహన్రంగా యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడుగు భద్రం, నడికట్ల వెంకన్న, పిడుగు క్రాంతి కుమార్, నగిరెడ్డి శ్రీను, పొట్ట పల్లి బుజ్జి, తోట గోపాలకృష్ణ, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, నల్లాల బాబులు,వంగవీటి మోహనరంగా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.