తవణంపల్లి ఫిబ్రవరి 28 మన ధ్యాస
భూ సమస్యల తప్పిదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తవణం పల్లె తాసిల్దార్ తాసిల్దార్ మాధవరాజు తెలిపారు అయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తవణంపల్లి మండలం తాసిల్దార్ మాధవరాజు తెలిపారు… ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని మొత్తం 27 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయని ఇప్పటివరకు 11 గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందని మిగిలిన 16 గ్రామంలో రీ సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు గతంలో సక్రమంగా రీ సర్వే పనులు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు.. గ్రామ రెవెన్యూ సభల ద్వారా వచ్చే వినతులకు పరిష్కారం చూపనున్నట్లు వెల్లడించారు.. పాసు పుస్తకాలలో ఏదైనా తప్పులుగా నమోదు అయి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపా..రీ సర్వే పనులను పూర్తి చేసి రైతులకు పాసు పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారుమార్చి 9 తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ గా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసే అవకాశాలు ఉందన్నారు ఇందుకుగాను సరకల్లు గ్రామాన్ని ఎంపీక చేసినట్టు వెల్లడించారు.