మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సైన్స్ శాస్త్ర విభాగాల ఆద్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత మరియు ముఖ్య అతిదీ ముందుగా సి వి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తరువాత విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ సైన్స్ అంటే కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న పాఠాలు మాత్రమే కాదని మన రోజువారీ జీవితంలో ప్రతి క్షణం విజ్ఞానం మనతో ఉంటుందని.ఉదయం లేవగానే ఉపయోగించే విద్యుత్, త్రాగునీరు,మొబైల్ ఫోన్లు,కంప్యూటర్లు – ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర ఫలితాలేనని. ఒక చిన్న సందేహం పెద్ద ఆవిష్కరణకు దారి తీస్తుందని.మీరు కూడా పరిశోధనా దృక్పథంతో ఆలోచించాలని. ప్రయోగాలు చేయాలని . విఫలమైతే భయపడకండి. ప్రతి విఫలం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుందని. మన దేశం విజ్ఞాన రంగంలో గొప్ప పురోగతి సాధించిందని.అంతరిక్ష పరిశోధనలు, వైద్య రంగం,సాంకేతిక విజ్ఞానం వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని. ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేది మీలాంటి యువతరమేనని .ఈ సందర్భంగా మనం మూడు ముఖ్యమైన విషయాలను గుర్తుచేశారు విజ్ఞానం మనకు నిజానిజాలు తెలుసుకునే శక్తిని ఇస్తుందని,విజ్ఞానం సమాజ అభివృద్ధికి పునాదని, విజ్ఞానం మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతుందని తెలియజేశారు.కార్య క్రమానికి ముఖ్య అతిది గా యల్లా శివ ప్రసాద్,విశ్రాంతి శాస్త్రవేత్త ఇస్రో పాల్గొని భారతదేశం అంతరిక్ష రంగంలో విశేషమైన ప్రగతి సాధించిందని.ముఖ్యంగా (ఐ ఎస్ ఆర్ ఓ) ద్వారా అనేక ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిందని చంద్రయాన్–1 (2008), చంద్రయాన్–3 (2023),మార్స్ ఆర్బిటర్ మిషన్ (2013) మరియు ఆదిత్య–ఎల్1 (2023) వంటి అంతరిక్ష ప్రయోగాల పై విద్యార్డులకు అవగాహన కల్పించారు. కాబట్టి విద్యార్థులారా, విజ్ఞానాన్ని ప్రేమించండి. పుస్తకాలకే పరిమితం కాకుండా, పరిశీలించండి, ప్రయోగించండి, ఆవిష్కరించండి. మీలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయండి. భవిష్యత్తు భారత దేశాన్ని నిర్మించేది మీరు అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని విద్యార్డులకు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె.వేంకటేశ్వర రావు,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ,అధ్యాపకులు వి రామరావు, కె సురేశ్,ఎస్‌కే మదీనా డా.శివప్రసాద్.వీరభద్ర రావు, శ్రీ లక్ష్మి, డా.కె బంగార్రాజు,మేరి రొసిలిన,పుష్పా, సతీశ్,రాజేశ్ మరియు అధ్యాపకేత సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *