మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి సి హెచ్ సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో పట్టణ టిడిపి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి,సమక్షంలో
రెండు టేబుల్స్ ను ఏలేశ్వరం గ్రామానికి చెందిన మోటమర్రి వీరబాబు ఆదిలక్ష్మి దంపతులు చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు.వారి కుమారులు రోహిత్ కుమార్,సాత్విక్ దుర్గారావు,పుట్టినరోజు సందర్భంగా బహుకరించినట్లు తెలిపారు.ఆసుపత్రి సిబ్బంది స్థానిక నాయకుల సమక్షంలో చిన్నారులకు కేకు కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రికి టేబుల్స్ బహకరించడం పై సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, కోణాల వెంకటరమణ, పెండ శ్రీను, మామిడి లలిత,కర్రోతు గాంధీ,రాతికింది సతీష్ తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *