
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:
ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో దేవర్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవర్స్ హాస్పటల్ అధినేత డాక్టర్ విజయ మేడం, డాక్టర్ సురేష్ మీడియాతో మాట్లాడారు.ఉచిత మెడికల్ క్యాంపు రోజు యాదృచ్చికం గా తన పుట్టినరోజు అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ విజయ తెలిపారు. అంతేకాకుండా రానున్న వేసవికాలం సందర్భంగా ప్రజలకు పలు జాగ్రత్తలు వివరించారు.మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లడం వల్ల డీహైడ్రేషన్ మరియు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందనీ,దీనివల్ల ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని, ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు వాడాలని లేదా తలపై క్లాత్ కప్పుకోవాలని, రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగండి అని డాక్టర్ విజయ మేడం తెలిపారు. ఒకవేళ మీకు జ్వరం,అతిగా చెమట పట్టడం,తల తిరగడం లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని,నిర్లక్ష్యం చేయకూడదని ఆమె ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు.ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారుగా 300 పైగా ఓ పి నమోదయిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవర్ష హాస్పిటల్ డాక్టర్స్ యజమాన్యం పాల్గొన్నారు.