మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల ప్రారంభించిన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆపార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈనెల 26న ప్రారంభించడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మరణానంతరం తన కుమారుడు వరుపుల సాయికిరణ్ తన తండ్రి అస్థికలను గంగలో కలిపేందుకు వెళ్లడంతో తిరిగి వచ్చిన మరుక్షణమే శుక్రవారం తన స్వగ్రామమైన ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం నుండి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టినట్టు సాయికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తన తండ్రి మార్గంలో ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ వారి అభిమానులకు అండగా ఉంటారని అన్నారు. ఏ క్షణానైనా కార్యకర్తకు ఆపద వచ్చిన వారి వెన్నుంటే ఉంటానన్నారు. తన తండ్రి ఏబాటలో అయితే పయనించారో అదే బాటలో నడుస్తానన్నారు. అలాగే తను కాశీలో ఉన్నప్పటికీ జనసైనికులకు పిలుపునిచ్చిన మరుక్షణం నియోజకవర్గంలోని పలువురు జనసేన సభ్యత్వాల కార్యక్రమాల్లో ముందుకు వెళ్లడం, మీ వెంట మేమున్నామంటూ లింగంపర్తి లో కార్యక్రమానికి పిలుపునిచ్చిన మరుక్షణం వందలాదిగా జనసైనికులు, తమ నాన్న అభిమానులు తన వెంట నడవడం కొండంత భరోసాగా ఉందన్నారు. నియోజకవర్గంలోని వారి ఆలోచనలతో, సూచనలతో ముందుకు వెళ్తానంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు, అలాగే యువత సభ్యత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని జనసేన పార్టీ ఆశయాలకు బాసట నివ్వాలని సాయి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలేశ్వరం టౌన్ వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి నాగేశ్వరరావు,కొల్లిపర దుర్గా శ్రీనివాస్, రాము శ్రీను,ఏలేశ్వరం మండల ఉపాధ్యక్షులు, జే అన్నవరం ఉపసర్పంచ్ కాలారి శ్రీను,బద్రవరం సర్పంచ్ కూనపురెడ్డి సుబ్బారావు, లింగంపర్తి జనసేన పార్టీ నాయకులు గడ్డం నూకాపతిరావు,కుర్ర గోవింద్, వరుపుల అప్పన్నపల్లి,భద్రవరం జనసేన నాయకులు కోనపురెడ్డి దుర్గారావు,మర్రివీడు జనసేన నాయకులు భవాని శంకర్,తిరుమాలి పసల ఇంద్రయ్య, పసల శివ, కట్ట పండు,ఎర్రవరం దాసరి భద్ర రావు, పేరవరం అంబటి కాపు, కాపరపు బాబ్జి, పెద్దనాపల్లి బీసెట్టి వాసు,మండలంలోని పలు గ్రామాల నుండి జనసైనికులు,అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *