మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం అప్పన పాలెం కిలిపే వారిది నీ పరిశీలించిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి సుమారు 18 కోట్ల నాబార్డ్ నిధులతో అప్పన పాలెం వారదని పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేస్తామ అన్నారు. ఈ సందర్భంగా కె విజయ్ కుమారి మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వారదని పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలు పాటు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా అన్ని అన్నారు. అప్పన పాలెం గ్రామవాసులు స్థానిక నాయకులు తమ కష్టాన్ని వివరించారు, విలేకరుల అడిగిన ప్రశ్నలకు బదులుగా గతంలో మాదిరిగా కాకుండా బ్రిడ్జి లెవెల్ పెంచి పటిష్టంగా ఉండేందుకు కృషి చేస్తానని కనీసం 100 సంవత్సరాలు పాటు బ్రిడ్జి కి ఇటువంటి అవంతరాలు లేకుండా ప్రతిష్టంగా నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు మూది నారాయణస్వామి, యువ నాయకుడు బొదిరెడ్డి గోపి అడిగిన ప్రశ్నలకు ఆమె సానుకూలంగా సమాధానాలు ఇచ్చారు.ఇదివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ మించి నిధులు వెచ్చించి వంద సంవత్సరాలు చెక్కుచెదరని వారదిని అందిస్తామని ఆన్నీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ డి ఏ సిహెచ్ రాజు, కాకినాడ జిల్లా తెలుగుదేశం ఆర్గనైజ్ సెక్రెటరీ మామిడి లలిత, కౌన్సిలర్ ఎండగుండి నాగబాబు, పెండ్ర శ్రీను, రాయుడు చిన్న, కోణాల.వెంకటరమణ, సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నార వీరబాబు, కరోతు సత్యనారాయణ గాంధీ,సామంతల గోపి,టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *