అనంతసాగరం, మన ధ్యాస, జనవరి 28,

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో ని నల్ల రాజుపాళ్లెం లో అన్నదమ్ముల మధ్య ఆస్తుల విషయమై గత రెండు సంవత్సరాలుగా కేత వారి కుటుంబంలో అన్న తమ్ముల మధ్య రగులుకున్న ఆస్తి వివాదాలు భూముల కోసం రక్త సంబంధాలు పేగు బంధాలను కూడా పక్కన పెట్టి ఆస్తులు కోసం అన్నదమ్ములు అక్క చెల్లెలు అని కూడా చూడకుండా ఒక మనిషి మృగంలా మారుతాడు అన్నది నల్లరాజుపాళ్లెం లో జరుగుతున్న సంఘటనలు చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది కేత సుబ్బారెడ్డి మీద తన తోడబుట్టిన వారే బయట వ్యక్తులతో చేతులు కలిపి గత రెండు సంవత్సరాలుగా తాను పొలంలో ఏ పంట వేసుకున్న దాన్ని నాశనం చేస్తూ మాకు నష్టాన్ని కలిగిస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురిచేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు.

మనిషి ఆస్తి కోసం మృగాల కంటే ఎక్కువగా మానవత్వాన్ని మరిచి ఇలా ప్రవర్తించడం ఏంటి అని మమ్మల్ని ఇలా వేధిస్తూ ఉన్నారని మేము గత సంవత్సరం వరి పంటను నాటుకుంటే తన అన్నదమ్ముడైన కేతా శ్రీనివాసరెడ్డి కలువాయికి చెందిన నాగిరెడ్డి రాజారెడ్డి అనే అతనితో చేతులు కలిపి అతని ద్వారా అతని అనుచరులతో మా వరి పంటను నాశనం చేశారని అప్పు చేసి మరీ వరి పంటను నాటుకుంటే దాన్ని ట్రాక్టర్లతో తొక్కించారు అయినా కొంత వరి పంట బతకడంతో దానిని కూడా రాజారెడ్డి తన అనుచరులను పంపించి ఆ పైరుకు గడ్డి మందు కొట్టించి నాశనం చేశాడు మరల 21వ తేదీ మేము పొలంలో ఉండగా రాజారెడ్డి అనుచరులు వచ్చి మా బ్యారినిలో ఉన్నటువంటి పొగాకును బయటపడేసి తలుపులు ధ్వంసం చేసి బ్యారినిలోని పైపులను పగలగొట్టి మాకు నాలుగు లక్షల రూపాయలను నష్టం కలిగించారు.

ఇలా పలుమార్లు రాజారెడ్డి తన అనుచరులతో తన జీవనాధారమైన పొలం పంటల మీద దాడి చేసి మా నోటి దగ్గర పంటను నాశనం చేసి నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నీకు దిక్కుఉన్న దగ్గర చెప్పుకో నువ్వే మీ మమ్మల్ని చేయలేవు అని రాజారెడ్డి తన అనుచరులతో వచ్చి బెదిరించడం జరిగిందని కేత సుజాత మీడియా తో మాట్లాడుతూ నన్ను నా భర్తను చంపేస్తామని కేత శ్రీనివాసులు రెడ్డి కేత జనార్దన్ రెడ్డి కాకూరి రత్తమ్మ కాకూరి రఘునాథరెడ్డి కలువాయి కి చెందిన నాగిరెడ్డి వారి రాజారెడ్డి వాళ్లతో వాళ్ల అనుచరులతో నా కుటుంబానికి ప్రాణహాని ఉందని వాళ్లు మమ్మల్ని ఎప్పుడూ ఏ సమయంలో చంపుతారు అన్న భయం మమ్మల్ని వెంటాడుతుందని కేత సుబ్బారెడ్డి అన్నారు వారి వలన నా కుటుంబానికి ప్రాణహాని ఉంది రాజారెడ్డికి నా కుటుంబం లో ఉన్న నా అన్న తమ్ములు అక్క కలసి మమ్ములను వేధిస్తున్నారని ఎక్కడైనా అప్పు తెచ్చుకొని పంట వేసుకుంటే దాన్ని నాశనం చేసి మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు కోర్టు ఉత్తర్వులు మా దగ్గర ఉన్నా వాటిని చూపించిన అసలు లెక్క చేయడం లేదని మీరు పొలంలో అడుగు పెడితే అక్కడికి అక్కడే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మాకు ఇలా అన్యాయం జరిగిందని అనంతసాగరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్న ఎస్సై సూర్యప్రకాశ్ రెడ్డి బాధితులైన మమ్ములను బెదిరిస్తూ మా మీదే కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేసి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడి మాకు ఎలాంటి న్యాయం చేయకుండా మా మీదే కేసులు పెడతామని భయపెడుతున్నాడు బాధితులమైన మాకు న్యాయం చేయాల్సిన అధికారే ఇలా మాట్లాడితే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి మీడియా ముందు వాపోయారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయకపోతే మేము కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అని వారు కన్నీరు మున్నేరు గా విల పిస్తున్నారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తామని మమ్మల్ని హత్య చేయడానికి మా ముందే సుఫారీల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మాకు ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియక భయాందోళన గురవుతున్నామని వాళ్లు వినిపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.
