యూరియా పంపిణీ పై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్య ప్రచారాలు హాస్యాస్పదం…!
జలదంకి, మన ధ్యాస, జనవరి 29,(నాగరాజు కె ).
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో నియోజకవర్గంలోని రైతులందరికీ పుష్కలంగా యూరియా పంపిణీ చేశామని జలదంకి మండల సొసైటీ చైర్మన్ కరియావుల అప్పలనాయుడు తెలిపారు.. యూరియా పంపిణి పై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదమని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు కూలీల కొరతతో గ్రామాల్లోకి యూరియా చేరడం ఆలస్యమైందని ఈ విషయంపై గోవర్ధన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులందరికీ పుష్కలంగా యూరియా పంపిణీ చేస్తున్నామని ఎక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి యూరియా కావాల్సి ఉంటే ఆయన జలదంకి మండలానికి వస్తే తాము యూరియా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అప్పలనాయుడు తెలిపారు. ఇకనైనా ఇలాంటి ప్రచారాలు మానుకొని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు..