మనధ్యాస, గూడూరు, నవంబర్ -24, (నెల్లూరు బ్యూరో ) : గూడూరు మునిసిపల్ ఎన్నికలో 13వ వార్డ్ నుండి వైస్సార్సీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న చిట్టెటి శివ కుమార్ ప్రచారాని ముమ్మరం చేసారు.. డిగ్రీ విద్యార్హత కలిగిన ఆయన విద్యావంతుడిగా, యువ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి వార్డ్ ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగాకలుసుకున్నారు.. స్థానికులతో మమేకమవుతు వారి అభిప్రాయాలను తెలుసుకొని, తనకు ఓటు వేసి ఆదరించాలని అభ్యర్థిఇంచారు.. విద్యావంతులు,, యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగ్యస్వాములు కావాల్సిన అవసరాని వివరిస్తూ వార్డు అభివృద్ధి తన వంతు కృషి చేస్తానని ప్రజలకు తెలియచేసారు.. యువత ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తు అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేరుకొన్నారు.. తన ఎన్నికల గుర్తు ఫ్యాన్ పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని వార్డ్ ఓటర్లను కోరారు..ఇంటింటా ప్రచారంలో స్థానికులకు కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు..ఈ ప్రచారం లో బొమ్మిడి శ్రీనివాసులు, నిరూప్ రెడ్డి, సాయి, శ్యామ్, హరి, శీనయ్యా, నాసిన నాగులు,వినోద్, బాలాజీ, వైస్సార్సీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *