రేణిగుంట మన ద్యాస నవంబర్ 23.

​తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎలమండ్యం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీపాళెం బాలక్రిష్ణను బలపరుస్తూ తిరుపతి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కుర్ర కాలువ వేణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
​గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసిన ఆయన, జీపాళెం బాలక్రిష్ణ మనందరికీ తెలిసిన వ్యక్తి అని, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. బ్యాలెట్ పేపర్‌పై వరుస సంఖ్య 1 వద్ద ఉన్న ‘మంచం’ గుర్తుకు ఓటు వేసి, అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.
​గ్రామంలో మెరుగైన రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడటమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జి పాలెం బాలకృష్ణ తెలిపారు.పోలింగ్ నవంబర్ 26 వ ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *