ప్రజల చెంతకు వెళ్లి సమస్యలు ఆలకించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..
’మంచం’ గుర్తుకు ఓటు వేసి జె. చిత్రను గెలిపించండి….
రేణిగుంట, నవంబర్ 23..
రేణిగుంట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి డి.పి. కోడలు జె. చిత్ర మరియు కూటమి వార్డు సభ్యుల అభ్యర్థుల తరఫున శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. “మన ఊరి బిడ్డ… మన ఊరి అభివృద్ధి…” అనే నినాదంతో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణతో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారానికి మహిళలు, పెద్దలు, యువత నుంచి మంచి స్పందన లభించింది.
నవంబర్ 26న జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు బ్యాలెట్ పేపర్‌పై వరుస సంఖ్య 1 ‘మంచం’ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి జె. చిత్ర మరియు వార్డు సభ్యులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, నవాబు, జనసేన యువనాయకుడు మిధున శాలిగూడా, మండల నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


