నెల్లూరు, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె)

నెల్లూరు పట్టణంలోని ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థ గ్రీన్ హోమ్, ఆధ్వర్యంలో నిర్మించిన ‘సెంట్రల్ వరల్డ్’ వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ని గ్రీన్ హోమ్ అధినేతలు బొల్లినేని హజరత్, బొల్లినేని హరిబాబు సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ,రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ సమయంలో నేప్రజల, నుండి,మంచి,ఆదరణవిశ్వాసం,అభిమానం,సంపాదించుకున్న సంస్థగా గ్రీన్ హోమ్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని ప్రశంసించారు.నాణ్యత,నమ్మకం, సమయపాలనతో ముందుకు సాగుతున్న గ్రీన్ హోమ్ సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, గ్రీన్ హోమ్ ప్రతినిధులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సెంట్రల్ వరల్డ్’ ప్రాజెక్ట్ నెల్లూరు నగర అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *