గద్వాల జిల్లా మనధ్యాస జనవరి 15: జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో పెద్దల సమావేశంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు ఈ ముగ్గులు పోటీలో పాల్గొనడంతో పండగ వాతావరణం తలపించింది. మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొని రకరకాల ముగ్గులు వేస్తూ రంగులు పల్లె వాతావరణం తలపించారు. మధ్యాహ్నం నుంచి గ్రామమంతా కళకళలాడుతూ సందడిగా కనిపించింది. ఈ కార్యక్రమనికి అతిధిగా జోగులాంబ గద్వాల్ జిల్లా డిసిసి జనరల్ సెక్రెటరీ మహ్మద్ సిరాజ్ హాజరై ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ హుస్సేన్ , మాజీ ఎంపీటీసీ హేమంత్ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *