మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శిడగం వెంకటేశ్వరరావు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావును ప్రతిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వైసిపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు రాష్ట్ర వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, అన్ని అటుపట్లను ఎదుర్కొని ఏలేశ్వరం పట్టణంలో వైసీపీని ఒక బలమైన శక్తిగా నిలబెట్టిన ఘనత ఎస్విఆర్ది అన్నారు. ఎస్ వి ఆర్ ను పరామర్శించిన వారిలో గిరిబాబు వెంట వైసిపి నేతలు బది రెడ్డిగోవింద్, సుంకర రాంబాబు, సామంతుల సూర్య కుమార్, పేకల జాను, గొడుగు నాగేంద్ర, రాచర్ల రమేష్, పైల విజయ్, లోగిస్ శేఖర్, వాగు బలరా, బత్తిన శ్రీను, దత్తిరాజ, తదితరులు ఉన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *