మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇథియోపియా నీటిపారుదల మంత్రిత్వశాఖ, సినర్గోస్ ఇంటర్నేషనల్ ఎన్జీవోలకు చెందిన ఆరు మంది సభ్యుల బృందం గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు.అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణ విధానం, నిర్వహణ పద్ధతులు,విపత్తు నిర్వహణ చర్యలు,ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన పొందారు. ప్రాజెక్టు ఈఈ సోలేమన్ ఇంజనీర్ల బృందానికి వివరించారు. అనంతరం బొగ్గుగుడిసె వద్ద ఉన్న నీటిపారుదల కాలువను పరిశీలించిన బృందం,అక్కడ అమలవుతున్న నిర్వహణ విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కాలువ నిర్వహణపై సమగ్ర సమాచారం అందించిన అధికారులకు,ఇంజనీర్లకు బృంద సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్శనా వర్కింగ్ ఆఫ్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్” అనే అంతర్జాతీయ స్టడీ అండ్ ఎక్స్పోజర్ విజిట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈకార్యక్రమం స్కైడైవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.ఎల్.నారాయణ, డైరెక్టర్ రఘు కిరణ్,ప్రోగ్రామ్ మేనేజర్ వరప్రసాద్, ప్రాజెక్టు ఏఈలు సాకేత్,అక్షయ్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *