మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పదవ తరగతి పరీక్షలల్లో విద్యార్థులందరూ అత్యున్నత మార్కులు సాధించాలని బాన్స్ వాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు.మండలంలోని ఖండేబల్లూర్,కౌలాస్,జుక్కల్ తదితర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. పాఠశాల గదిలో సబ్జెక్టులపై విద్యార్థులకు ఉన్న పట్టును అడిగి తెలుసుకున్నారు.పదవ తరగతి పరీక్షలను ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో రాయాలని,భయాందోళన చెందేఆవసరం లేదని,పరీక్షల సమయం వరకు మనస్సుపెట్టి విధ్యబోధన చేయాలని కోరారు.
పదవ తరగతి పరీక్షలు విద్యార్థులకు మూల మలుపు అని పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే పై ఉన్నతచదువులల్లో విజయం సాదించవచున్నారు. ఉపాధ్యాయులు కూడా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడమే కాకుండా,ఏదైనా సబ్జెక్టులు విద్యార్థి వెనుకబడి ఉంటే వారిపట్ల వ్యక్తిగత శ్రద్ధచూపుతూ ఆ సబ్జెక్టులో రాణించే విధంగా కృషిచేయాలని సూచించారు.ప్రతిరోజు సాయంత్రం ఫలహరంను అందించాలన్నారు. విద్యార్థులకు కలసి సబ్ కలెక్టర్ కిరణ్మయి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన రుచికరమైన మెనూ ప్రకారం భోజనం అందించాలని వంట ఏజెన్సీలకు సూచించారుఆమె వెంట ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ,విద్యాశాఖ అధికారి తిరుపతయ్య,తహసీల్దార్ మారుతి,డిప్యూటీ తహసీల్దార్ హేమలత,గిర్ధవర్ రామ్ పటేల్, ప్రధానోపాధ్యాయులు లాలయ్య,హన్మంత్ రెడ్డి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.