సంస్కృతిని ప్రతిబింబించిన సంక్రాంతి సంబరాలు……. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మన ధ్యాస, నెల్లూరు,జనవరి 14 :సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని 3,52వ డివిజన్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా నిర్వహించిన వివిధ సంప్రదాయ క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సంబరాలకు రాష్ట్ర మంత్రివర్యులు పొంగురు నారాయణ సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు మరియు పిల్లల కోసం నిర్వహించిన ముగ్గలపోటీలు, లెమన్ స్పూన్, బాటిల్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి రమాదేవి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ….. సంక్రాంతి పండుగ తెలుగు వారి సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి సంబరాలు డివిజన్ ప్రజలందరిలో ఆనందాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు.ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సిరిసంపదలు, ఆనందోత్సాహాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలు మీ కష్టాలను తొలగించి, సరికొత్త ఆశలకు నాంది పలకాలని, గొబ్బెమ్మల అలంకరణతో ప్రతి ఇల్లు కళకళలాడాలని ఆశీస్సులునట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ మహోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 52వ డివిజన్ రంగనాయకులపేటలోని కో క్లస్టర్ ఇంచార్జి సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో,అదే విధంగా 3వ డివిజన్ కిసాన్ నగర్,గాండ్లనగర్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాల క్రీడా పోటీలను మంత్రి నారాయణ సతీమణి పొంగురు రమాదేవి వారిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్,కపిరా రేవతి ,జనరల్ సెక్రటరీ బాషా,పొంగురు సుబ్బారెడ్డి, రామారావు, బుష్ర..3వ డివిజన్ కార్య నిర్వహకులు -సిరిగిరి సత్యనారాయణ, వరికుంట రాజా, నరసాపురం సునీల్ ,చిరువెళ్ల హరి కృష్ణ,నారు భరత్, బద్రి కార్తీక్,గాండ్ల నగర్ మిత్రమండలి తదితరులు పాల్గొన్నారు.







