మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 31 :మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో.. వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షురాలుగా అరవ ప్రమీల ని, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా అరుణ శాంతి ని, సిటీ ఎస్సీ సెల్ సెక్రటరీ కరుణా , సరిత, సుజాత ను, వైయస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ సెక్రెటరీగా అన్నమ్మ ని నియమించడంతో.. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో డివిజన్ ఇన్ చార్జ్ సందీప్ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని, కలిసి వారు కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారుపార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని వారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *