మన ధ్యాస,కోవూరు,డిసెంబర్ 31: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వున్నారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు పంచాయతీలోని 10 వ వార్డులో పెన్షన్ పంపిణి చేసిన అనంతరం ఆమె రామిరెడ్డి తోట ప్రాంతంలో 17 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లుమరియు 50 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న పీటర్స్ కెనాల్ కల్వర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చాక ఎన్నికలకు ముందు చేసిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. వయో వృద్ధులు గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు గతంలో 3 వేలున్నపెన్షన్ మొత్తాన్ని 4 వేలకు పెంచడం, 3 వేలున్న దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6 వేలు ఇవ్వడం అనేది దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అమలు అవుతుందన్నారు. వృద్ధులు, దివ్యాంగుల అవసరాలను గుర్తించి ప్రతి నెల క్రమం తప్పకుండా 1 వ తేదీ పెన్షన్ అందిస్తున్నామని 1 వ తేది ఆదివారం మరేదైనా సెలవు దినం వస్తే ఒక రోజు ముందే ఇంటికి వెళ్లి పెన్షన్ అందచేస్తున్న ఘనత చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పెరిగిన ట్రాఫిక్ మరియు భవిషత్తులో ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేవలం 4.5 మీటర్లున్న పీటర్స్ కెనాల్ పై కల్వర్ట్ ను 16 . 5 మీటర్ల మేర వెడల్పు చేసామన్నారు. పీటర్స్ కెనాల్ పై కల్వర్ట్ నిర్మాణానికి ఎంపి లాడ్స్ ద్వారా 50 లక్షలు నిధులు కేటాయించిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు కి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీగా వున్న కోవూరు పంచాయతిని మున్సిపాలిటిగా అప్ గ్రేడ్ చేసేందుకు మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ సమ్మతించారన్నారు. త్వరలో పురపాలక హోదా పొందనున్న కోవూరు పట్టణంలో రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకై 15 వ ఆర్ధిక సంఘ నిధుల ద్వారా 1 కోటి 50 లక్షలు, 1 కోటి 45 లక్షల జల్ జీవన్ నిధులతో తాగునీటి అవసరాల కోసం వెచ్చిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక 6 కోట్ల రూపాయలు వ్యయంతో కోవూరు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఆమె వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నామన్నారు. త్వరలో బాపన కాలువ ఆధునీకరణ పనులు చేస్తామని నిర్వాసితులకు నందలగుంటలో ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోవూరు నియోజక అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసారు. ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న తన ఆశయ సాధనలో సంపూర్ణ సహకారం అందిస్తున్న అధికారులు, నాయకులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దారు వెంకట సుబ్బయ్య, ఇంచార్జ్ ఎంపీడీఓ చిలకపాటి శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎ ఇ శ్రీనివాసులు, డి ఇ విజయకుమార్, ట్రాన్స్ కో ED రమేష్ చౌదరి, పెన్నాడెల్టా జెట్టి రాజగోపాలరెడ్డి, సర్పంచ్ యాకసిరి విజయమ్మ, ఎంపిపి తుమ్మల పార్వతి, టిడిపి మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి స్థానిక నాయకులు శివప్రసాద్ రెడ్డి, తవికుమార్, పిచ్చుక మధుసూదన్, గాదిరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

