. మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లతో కలిసి.. ఎక్సె ఆఫీషీయో నెంబర్ హోదాలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్బంగా నెల్లూరులో అధికారులు ప్రోటోకాల్ విషయంలో.. నిబంధనలు పాటించకుండా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను.. అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు కనీస సమాచారం ఇవ్వడం లేదన్న విషయాన్ని.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లారు.అలాగే నెల్లూరు వి ఆర్ మున్సిపల్ స్కూల్లో.. అడ్మిషన్ల ప్రక్రియ.. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు టీం చేత అడ్మిషన్లు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని.. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా అదే విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించబోతున్నారా అన్న విషయాన్ని కమిషనర్ స్పష్టం చేయాలని అడిగారు.అలాగే ఇటీవల నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు నగర పాలక సంస్థ పరిధిలో.. డ్రైనేజీ కెనాల్స్ పక్కన.. బఫర్ జోన్ కావాలంటూ.. 2500 పేదవారి ఇళ్లకు మార్కింగ్ ఇచ్చి.. ముడున్నర మీటర్ వరకు.. తొలగిస్తామని.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే .. విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.మూడున్నర మీటర్ వరకు ప్రజలు స్థలాలు కోల్పోతే.. అక్కడ ఇల్లు పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని..ఇది సరైన విధానం కాదని.. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని విరమించుకోవాలని నగరపాలక సంస్థను కోరారు.కౌన్సిల్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…….కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అధికార పార్టీ నిర్ణయాలకు మాత్రమే పరిమితమైంది అని తెలిపారు.కౌన్సిల్లో ఎక్కడ ప్రజా సమస్యలు చర్చించేందుకు.. తావు లేకుండా చేశారని మండిపడ్డారు. కౌన్సిల్లో పెట్టిన ఎజెండా లోని ఏ అంశం పై కూడా చర్చ లేకుండా.. నేరుగా నిర్ణయాలు తీసుకునే విధంగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు.కేవలం కార్పొరేషన్ లో అధికార పార్టీకి.. బలం ఉందన్న ఒకే ఒక కారణంతోనే ఈ విధంమైన.. వ్యవహార శైలితో అధికార పార్టీ అనాలోచిత నిర్ణయాలు చేస్తుందని మండిపడ్డారు.వి ఆర్ హైస్కూల్లో అడ్మిషన్లన్నీ మంత్రి నారాయణకు సంబందించిన ఎన్ టీమ్ కు సంబంధించిన వారే చేపడుతున్నారని అడిగినప్పుడు.. సిఎస్ఆర్ పండుతో దాన్ని అభివృద్ధి చేశామని.. దాటవేసే విధంగా సమాధానం ఇస్తున్నారని అన్నారు.వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో 43 వేల ప్రభుత్వ పాఠశాలను ఆధునికరించి వత్తులు సమకూర్చడం జరిగిందన్నారు.నాడునేడులో పనులన్నీ పారదర్శకత విధానంలో నిర్వహించి అడ్మిషన్లన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిపేమన్నారు.మంత్రి నారాయణ ఏకపక్షంగా వీఆర్ఐ స్కూల్లో అడ్మిషన్ నిర్వహిస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని..ఎక్సె ఆఫీషీయో నెంబర్ హోదాలో.. ప్రజా సమస్యలపై.. పలుమార్లు లేఖలు రాస్తే కనీసం దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా కమిషనర్ లేరన్నారు.మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్న తప్పులకు.. తప్పకుండా చట్టం పరిధిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నెల్లూరు 13వ డివిజన్ లో ఒక సెంటు కంటే చిన్న స్థలంలో.. నివాసం ఉంటున్న దళిత మహిళ ఇంటి బాత్ రూమ్ ను దయ కూడా లేకుండా.. కమిషనర్ నిలువునా దగ్గరుండి కూల్చి వేయించారని మండిపడ్డారు.అలాగే 46 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఒక వాటర్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసేసారని.. దానిపై ఎన్నోసార్లు కమిషనర్ కు.. ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు. కమిషనర్ అధికార పార్టీకి తొత్తుగా మారే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.నగరపాలకు సంస్థలో జరుగుతున్న పనుల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా చెత్త తరలింపు.. విషయంలో ఒక్కో లక్షా పదివేల రూపాయలు ఖర్చు చేస్తూ.. 11 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఉపయోగించి సమాచారానంత తీసుకొని.. అధికార పార్టీ చేస్తున్న.. ప్రజాధనం దుర్వినియోగ విధానాలపై.. ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. నెల్లూరు అభివృద్ధి విషయంలో.. మంచి నిర్ణయాలు తీసుకుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు.. సహకారం అందిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *