ఐరాల, మన ధ్యాస డిసెంబరు-25 భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహరి వాజ్పేయి శతజయంతి సందర్భంగా, ఐరాల మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఐరాల మండల అధ్యక్షులు పీ. సునీల్ కుమార్ అధ్యక్షతన, చంద్రయ్య గారి పల్లి సమీపంలోని ఓల్డ్ ఏజ్ హోమ్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు బియ్యం, కూరగాయలు, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేయడం ద్వారా మానవతా సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల ప్రధాన కార్యదర్శులు సి. అశోక్, గుణశేఖర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుమార్, జిల్లా కార్యదర్శి జయ చంద్ర రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, అలాగే ప్రేమానంద్, పరదేశీ, గిరి, త్యాగరాజు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాజ్పేయి సేవా భావనకు అనుగుణంగా సమాజ హితాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నేతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
