ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి సుభాష్

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అన్నారు.శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో పాస్టర్ రావుల క్రిస్టియన్ రాజు,పాస్టరమ్మ ఎలిజిబిత్ రాణి ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ సౌజన్యంతో ఏసు సన్నిధి ప్రార్ధన మందిరంలో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,క్రిస్టమస్ పండుగ శాంతి,ప్రేమ,ఐక్యతకు ప్రతీక అని అన్నారు.మనం ఎదుటివారికి సేవ చేస్తే వారి తిరిగి మనకు సేవ చేస్తారని,తోటి వారిని ప్రేమించాలని,శాంతి,సహనం,మానవసేవే మాధవ సేవగా క్రీస్తు బోధనల ద్వారా తెలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్,రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు(శివ),టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్,గ్రామ పెద్దలు సకురు విష్ణు,కండిపిల్లి సూరిబాబు,కీర్తి రాజు, కీర్తి దొరబాబు,వాసంశెట్టి అర్జున్, కేళంగి నాగేశ్వరావు,కీర్తి నాగేశ్వరావు,కీర్తి రామకృష్ణ,మోర్త ప్రకాశరావు,బత్తిన జాన్,పిల్లా అప్పారావు,నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *