మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంగమేశ్వర్ గౌడ్‌పై హరిన్ కుమార్ 261 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత 50 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లో కూడా ఇంత భారీ మెజార్టీ నమోదు కాలేదని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. హరిన్ కుమార్ విజయం గ్రామ చరిత్రలో ఓ అరుదైన ఘట్టమని వారు అభిప్రాయపడ్డారు.విజయం అనంతరం సర్పంచ్ హరిన్ కుమార్,ఉప్ప సర్పంచ్ గంగారాం నాయక్, వార్డు సభ్యులు చాకలి మహిపాల్,మంగలి సాయవ్వ,గుల సాయవ్వ,ఆఫ్రిది,ఎరుకాల భూమయ్య లను గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భాజా భజంత్రీలతో భక్తిశ్రద్ధలతో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పెద్దమ్మ తల్లి వద్ద మొక్కులు చెల్లించి ఆలయం నుంచి గ్రామ వీధుల గుండా విజయోత్సవ ర్యాలీగా గ్రామంలో తిరిగారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పెద్ద పట్లోళ్ల నర్సారెడ్డి,లక్ష్మీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న పట్లోళ్ల ప్రతాప్ రెడ్డి,వాసుదేవ రెడ్డి లు కలిసి హరిన్ కుమార్‌ను శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు.సత్కార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..ఈ విజయం పూర్తిగా ప్రజలకు అంకితమని, గ్రామ అభివృద్ధి దిశగా హరిన్ కుమార్ నాయకత్వం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. వారి వెంట గ్రామ అధ్యక్షులు నిఖిల్ ,మాజీ ఉపసర్పంచ్ వెంకట్ రాములు, మంగలి చిన్న రాములు,గుల మేకల బోయిని విఠల్,కొరబోయిన భూమయ్య,మొహమ్మద్ గౌస్,హరిజన్ దుర్గయ్య,ఆగమయ్య, పెద్దలు, యువత,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *