వింజమూరు, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 16,(నాగరాజు కె )
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , తమ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో నేరుగా సమావేశమై వారి అర్జీలు, సమస్యలను స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే ని కలిసి తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను వివరించారు.ప్రజలు వినిపించిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే ఎంతో శ్రద్ధగా, ఓర్పుతో విని, వాటి తీవ్రతను అర్థం చేసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో తక్షణమే ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యలపై పూర్తి వివరాలు తెలియజేస్తూ వీలైనంత త్వరగా పరిష్కారం చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే స్పందనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా కాకర్ల సురేష్ తెలిపారు.
