మన్నెం వెంగన్న మృతికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
ఉదయగిరి డిసెంబర్ 13, మన ద్యాస న్యూస్, (కె నాగరాజు)
ఉదయగిరి మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు,మంచి మనసున్న పెద్దాయన మన్నెం వెంగన్న హఠాన్మరణం పట్ల ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ప్రగాఢ విచారమును వ్యక్తం చేశారు.డిసెంబర్ 13న మాసాయిపేట గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంగన్న పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, శోకసంతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కఠిన సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా నిలబడాలని చెప్పి, ఎల్లవేళలా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున తన పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంగన్న గురించి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమం ఎక్కడ జరిగినా చిరునవ్వుతో ముందుండి పాల్గొంటూ, అందరినీ ఆప్యాయం గా పలకరించే వెంగన్న ఇక మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని,వారి మరణం తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాక, గ్రామ ప్రజలకు కూడా తీరని లోటుని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంగన్న కి కన్నీటి వీడ్కోలు పలికారు
