మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏలేశ్వరం గురుకుల పాఠశాల మరియు లింగంపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, వ్యవసాయ అధికారి, సామర్లకోట ఎస్టిఎల్ శ్రీమతి పీ కే వి లక్ష్మి మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై అవగాహన కల్పించారు. ఆమే మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంటలు దిగుబడులు బాగా రావాలంటే ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించి సమతుల్య పోషకాల ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఆత్మ బి.టి. యం. నీలి బాబురావు సేకరించిన మట్టి నమూనా వివరాలను మొబైల్ యాప్ లో ఆన్లైన్ చేసే విధానమును విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం, సైన్స్ టీచర్, ఏ ఈ ఓ సత్య, వి ఏ ఏ లు రాజ్ కుమార్, దీప్తి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, విద్యార్థులు ఇతర టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.







