మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో ఆల్ఫ్రెడ్ నోబెల్ (ఆల్ఫ్రెడ్ నోబెల్) ఒక స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త అని , ఇంజనీర్, ఆవిష్కర్త మరియు వ్యాపారవేత్త, డైనమైట్‌ను కనుగొనడం ద్వారా ప్రసిద్ధి చెందారని , మరియు తన సంపదతో మానవాళికి గొప్ప సేవ చేసిన వారికి ఇచ్చే నోబెల్ బహుమతులను (నోబెల్ బహుమతులు) స్థాపించారని ; ఆయన వీలునామా ద్వారా ఈ బహుమతులు 1895లో ప్రారంభమయ్యాయి, ఇవి శాంతి, సాహిత్యం, వైద్యం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, మరియు ఆర్థికశాస్త్ర రంగాలలో ఇవ్వబడతాయయని మరియు ఆయన జీవిత చరిత్ర ఆవిస్కరణలు విపులంగా వివరించారు. 2025 సంవత్సరానికి సంబందించిన నోబెల్ బహుమతుల పొందిన వ్యక్తుల పరిశోదనల గూర్చి విద్యార్డులకు విపులంగా వివరించారు. ఈ కార్య క్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వర రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ ఆర్‌ఆర్‌సి కొ-ఆర్డినేటర్ డా. ఎస్‌కే మదీనా, అద్యపకులు వి రామ రావు , కె. సురేష్. డా. శివప్రసాద్. వీరభద్ర రావు, శ్రీ లక్ష్మి,డా. అధ్యాపకేత సిబ్బంది సత్యనారాయణ, ధర్మ రాజు , పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.







