కొండాపురం, ఫిబ్రవరి 02,(మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె).

ఉదయగిరి నియోజకవర్గం గానుగపెంట పంచాయతీ పరిధిలోని హరిజనవాడలో బంకా చెన్నకేశవులు, అరుంధతి వాడలో జడ తిరుపాలు , పెరికి పాలెం గ్రామంలో గుడిపాటి బ్రహ్మయ్యలు ఆనారోగ్యంతో బాధపడుతున్న విషయం గానుగ పెంట మాజీ సర్పంచ్ నర్రావుల వెంకటేశ్వర్లు ద్వారా తెలుసుకొని స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్.అనంతరం ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ మాట్లాడుతూ పేదలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ట్రస్ట్ కార్యాలయానికి తెలియజేయాలని తెలిపారు. గ్రామాలలో నాయకుల ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దేవినేని వెంకటసుబ్బయ్య , చెరుకూరి శేషయ్య , నర్రావుల బుజ్జి , సంగీతం మల్లికార్జున, పరుచూరి హజరత్,అంకయ్య,సంజీవ రావు నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
