మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు వాహనదారులకు ఫైన్ విధించారు.ఈ సందర్భంగా ఎస్సై రామ లింగేశ్వరరావు మాట్లాడుతూ వాహనదారులు వాహన పత్రాలతో పాటు, లైసెన్సు, తప్పక కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పక ధరించాలని తెలిపారు, వాహన చట్ట నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.






