మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లీ మండలంలోని సిర్పూర్–మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా సందర్శించి తనిఖీ చేశారు.ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం,నగదు తదితరాలను అక్రమంగా తరలించకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆమె సిబ్బందికి ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఆమె వెంట తహసీల్దార్ ముజీబ్, ఆర్‌ఐ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.








